జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTR క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే వారిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.