పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో భారత్ పైచేయి సాధించింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్‌పై విజయం సాధించినట్లు భావిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ బున్యన్‌లో పాకిస్థాన్ ఘన విజయాన్ని అందుకుందంటూ, అందుకు ప్రతీకగా పాక్ ప్రధాని షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మున్నీర్ ఓ ఫోటోను బహుమతిగా ఇస్తున్నట్లు ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.