దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో దాదాపు దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళ వర్షాలకు తడిసిముద్దైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.