దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన గవర్నర్‌లు, సీఎంతో ప్రధాని మాట్లాడారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.