అందరూ జాగ్రత్తగా ఉండాలి

అందరూ జాగ్రత్తగా ఉండాలి

రాష్ట్రంలో కోవిడ్‌ను బాగా అరికట్టగలిగామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై ఆయన మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కోవిడ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానంతో ఎవరైనా వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్నారు.కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ-క్రాప్‌పై దృష్టి ఉంచాలని సీఎం సూచించారు.

ఈ-క్రాప్ జరగని రైతు ఉండకూడదని, డాక్యుమెంట్ల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. కచ్చితంగా అడ్వైజరి సమావేశాలు జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్‌బీకేలో రైతుల నుంచి వచ్చే సలహాలు తీసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్‌లోకి రాకుండా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు. జగనన్న పచ్చతోరణం కింద ఆగస్టు 15 నుంచి 31 వరకు కోటి మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్ సూచించారు.