“జై హనుమాన్” ఫస్ట్ లుక్ రాబోతోంది ..!

Jai Hanuman
Jai Hanuman" first look is coming ..!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ మూవీ ల్లో “జై హనుమాన్” (Jai Hanuman Movie) కూడా ఒకటి. యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో మూవీ “హను మాన్” (Hanu Man) కి సీక్వెల్ గా వస్తున్నా ఈ మూవీ కోసం కూడా ఆడియెన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే రీసెంట్ గా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ లు ఇచ్చిన హింట్స్ తో అయితే హను మాన్ సీక్వెల్ నుంచి అప్డేట్ ఈ ఏప్రిల్ లోనే రాబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. మరి ఈ ఉగాది కానుకగానే అవైటెడ్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ రావచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండగా ఇపుడు దీనికి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా టాక్ వస్తుంది .

Jai Hanuman" first look is coming ..!
Jai Hanuman” first look is coming ..!

మరి దీని ప్రకారం జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఈ ఏప్రిల్ 9న రావచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది . ఇక ఈ భారీ మూవీ కి గౌర హరీష్ సంగీతం అందిస్తుండగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది.