అరవ తంబీలకు దగ్గరవుతున్న ఎన్టీఆర్‌.. రికార్డు కలెక్షన్స్‌

jai-lava-kusa-movie-record-collections-in-tamil-nadu-state

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటించిన ‘జైలవకుశ’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయడం జరిగింది. తెలుగులో ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. అలాగే తమిళంలో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ఏ సినిమా కూడా తమిళనాట విడుదల కానన్ని థియేటర్లలో ఈ చిత్రం విడుదల అయ్యింది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ఏ భాష ప్రేక్షకులు అయినా ఆధరిస్తూనే ఉంటారు. తాజాగా ఈ సినిమాను కూడా తమిళ ఆడియన్స్‌ ఆధరిస్తూ ఉన్నారు. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా మూడు కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

ఎన్టీఆర్‌ కెరీర్‌లో స్పీడ్‌గా 100 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా తమిళనాట కూడా మంచి ఆధరణ పొందడంతో ఎన్టీఆర్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. టాలీవుడ్‌ హీరోలు తమిళనాట సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘స్పైడర్‌’ చిత్రంతో మహేష్‌బాబు తమిళనాట జెండా పాతాలని భావిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ ముందే అక్కడ ప్రేక్షకులను అలరించి, మంచి వసూళ్లను సాధించడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. కర్ణాటక మరియు కేరళలో కూడా ఈ సినిమాకు మంచి ఆధరణ లభిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ మద్య కాలంలో ఏ తెలుగు హీరో సాధించలేని, చేయలని మూడు పాత్రల రికార్డును ఎన్టీఆర్‌ చేశాడు. ఈతరం స్టార్‌ హీరోల్లో మూడు పాత్రలు పోషించగలిగిన స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ మాత్రమే అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఢంఖా మ్రోగించి మరీ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌, తమిళనాడు, కర్ణాటక ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా దుమ్ము దుమ్ముగా ఎన్టీఆర్‌ కలెక్షన్స్‌ వసూళ్లు సాధించడంతో నందమూరి ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు. వరుసగా ఎన్టీఆర్‌ ఈ చిత్రంతో కూడా సక్సెస్‌ను అందుకోవడంతో ఆయన క్రేజ్‌ మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాతో తమిళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్‌.