‘జైసింహా’ ట్రైలర్‌ 2 అంచనాలు మార్చేసింది

Jai Simha review of Pre release trailer

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఇటీవల కాలంలో ప్రతి సినిమాకు టీజర్‌, ట్రైలర్‌లు విడుదలవుతూ ఉన్నాయి. ఒక సినిమాకు ఒక ట్రైలర్‌ మాత్రమే విడుదల చేస్తున్నారు. చాలా అరుదుగా మాత్రమే రెండవ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరుగుతుంది. బాలయ్య ‘జైసింహా’ చిత్రానికి రెండవ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆడియో విడుదల సందర్బంగా విడుదల చేసిన ట్రైలర్‌తో ఫ్యాన్స్‌ మాత్రమే సంతృప్తి చెందారు. అందులోని డైలాగ్స్‌ మరియు యాక్షన్‌ సీన్స్‌ మాస్‌ ఆడియన్స్‌ను అలరించాయి. కాని ఫ్యామిలీ ఆడియన్స్‌ మరియు ఎ సెంటర్‌ ఆడియన్స్‌కు అంతగా రుచించలేదు. సినిమాపై అంచనాలు పెంచాలనే ఉద్దేశ్యంతో మరో ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చిత్ర యూనిట్‌ సభ్యులు ట్రైలర్‌ 2ను విడుదల చేయడం జరిగింది. ఈ రెండవ ట్రైలర్‌లో సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపించారు. అలాగే బాలయ్య పోషించిన రెండు పాత్రలకు సంబంధించిన పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. బ్రహ్మానందం కామెడీ మరియు నయనతార, హరిప్రియలతో బాలయ్య రొమాన్స్‌ను ఈ ట్రైలర్‌లో ప్రధానంగా చూపించడం జరిగింది. ఈ ట్రైలర్‌తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

బాలయ్య గత చిత్రం ‘పైసా వసూల్‌’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్‌కు సంక్రాంతి కానుకగా నిలవడం ఖాయం అని, నందమూరి ఫ్యాన్స్‌ మరోసారి సంక్రాంతి సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయబోతున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.