అజ్ఞాతవాసికి షాక్‌.. ఇప్పుడేమంటావ్‌ కత్తి మహేష్‌?

TS Govt rejected permission for agnathavasi premieres show
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై గత కొన్ని నెలలుగా కత్తి మహేష్‌ చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. పవన్‌ ఏ పని చేసినా కూడా దానిపై కత్తి మహేష్‌ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్‌ కళ్యాణ్‌ కలిశాడు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న నేపథ్యంలో అభినందించేందుకు స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ జనవరి 1న ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన విషయం తెల్సిందే. ఆ సందర్బంగా కేసీఆర్‌తో పవన్‌ దాదాపు గంట పాటు భేటీ అయ్యాడు. రాజకీయాల గురించి ఇంకా పలు విషయాల గురించి కేసీఆర్‌తో పవన్‌ మాట్లాడటం జరిగింది. పవన్‌, కేసీఆర్‌ల భేటీ గురించి కత్తి మహేష్‌ మాట్లాడుతూ అజ్ఞాతవాసి చిత్రం కోసం పవన్‌ ఇలా కేసీఆర్‌ను కలిశాడు అంటూ ఆరోపించాడు.

నిన్న మొన్నటి వరకు కేసీఆర్‌ అంటే పడని వ్యక్తి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో యుద్దం చేస్తాను అన్న వ్యక్తి ఉన్నట్లుండి కేసీఆర్‌కు మద్దతు తెలపడం, ప్రశంసలు గుప్పించడం అనేది స్వలాభం కోసం అంటూ కత్తి మహేష్‌ విమర్శించాడు. అజ్ఞాతవాసి విడుదల కాబోతుంది. ఆ సినిమాకు మిడ్‌ నైట్‌ షోలు, బెన్‌ఫిట్‌ షోల అనుమతి కావాలి. అందుకే కేసీఆర్‌తో పవన్‌ మచ్చిక చేసుకున్నాడు అంటూ కత్తి మహేష్‌ ఆరోపించాడు. అజ్ఞాతవాసి చిత్రం విడుదలైన సందర్బంగా తాను చేసిన విమర్శలు నిజమే అంటారు అంటూ కత్తి మహేష్‌ చెప్పుకొచ్చాడు.

కత్తి మహేష్‌ ఊహ నిజం కాలేదు. కత్తి మహేష్‌ అనుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం అజ్ఞాతవాసి ప్రత్యేక షోలకు అనుమతించలేదు. అంతా భావించినట్లుగా కేసీఆర్‌తో పవన్‌ అసలు సినిమా విషయాలు మాట్లాడలేదని, కేవలం రాజకీయాల గురించి మాత్రమే పవన్‌ మాట్లాడాడు అంటూ తేలిపోయింది. కేసీఆర్‌ ప్రభుత్వం అజ్ఞాతవాసి సినిమాపై ప్రత్యేక ప్రేమ చూపించలేదని, అసలు అజ్ఞాతవాసి గురించి ప్రత్యేక దృష్టి ఏమీ లేదని తేలిపోయింది. దాంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడేమంటావ్‌ కత్తి మహేష్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. అజ్ఞాతవాసికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌పై కత్తి మహేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.