కోలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన “జైలర్” మూవీ !

కోలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన “జైలర్” మూవీ !
Movie News

గత మూడు వారాల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాస్ ఫామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ జైలర్ మూవీ విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ను ప్రేక్షకులకు నచ్చే విధంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుంటు తెరకెక్కించారంట . ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 630 కోట్ల కు పైగా కలెక్ట్ చేసి ఎన్నో రికార్డులను తన పేరున ఉంచుకున్నది .

తాజాగా మరో రికార్డును దక్కించుకుని చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా కేవలం ఒక్క తమిళనాడు లోనే రూ. 100 కోట్లు షేర్ ను కాలేచ్ట్ చేసి కోలీవుడ్ మూవీ పరిశ్రమలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కాగా మూడు రోజుల క్రితమే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదల అయ్యి నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతోంది.

కోలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన “జైలర్” మూవీ !
Rajinikanth

ఈ మూవీ విజయంలో రజినీకాంత్ మాత్రమే కాకుండా … ప్రత్యేక పాత్రలలో అదరగొట్టిన తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ మరియు సంజయ్ దత్ లు కూడా దోహదపడ్డారు.