నెగిటివ్ పాత్రలో ‘జాన్వీ కపూర్’

నెగిటివ్ పాత్రలో ‘జాన్వీ కపూర్’
Cinema News

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జాన్వీ కపూర్ పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉంటుందని, ఈ క్రమంలో వచ్చే సీన్స్ లో జాన్వీ పాత్ర బాగా నెగిటివ్ గా సాగుతుందని తెలుస్తుంది .

నెగిటివ్ పాత్రలో ‘జాన్వీ కపూర్’
NTR, Janvi Kapoor

అసలు జాన్వీ పాత్ర ఎందుకు నెగిటివ్ గా సాగింది అని, దేవర పార్ట్ 2 లో రివీల్ చేస్తారంట . కాగా ఈ మూవీ కోసం లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరుగుతుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై కూడా చేస్తున్నాడు. మొత్తానికి.. ఈ మూవీ కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.