వన్ డే మ్యాచ్ అన్న పవన్ కి…గల్లా దిమ్మతిరిగే కౌంటర్

jayadev galla counter attack on pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజులుగా చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు రూటు మార్చాడు. మహేష్ బాబు బావ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మీద తన ట్వీట్లు ఎక్కుపెట్టాడు. ముందు గల్లా జయదేవ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ‘‘ కొత్త సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. జగన్ పవన్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి కథ-దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ అయితే మోడీ-షా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం విడుదల అవుతుంది..’’ అంటూ వ్యంగ్యంగా పవన్-జగన్ ల బంధాన్ని ప్రస్తావించారు. అయితే గల్లా పేల్చిన కౌంటర్ కి రెండు రోజుల తర్వాత జనసేన పార్టీ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని జనసేన పార్టీ విడుదల చేసింది.

ఆ ప్రెస్ నోట్ ప్రకారం ‘‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ జనసేన కౌంటర్ అటాక్ చేసింది. దీనికి మాత్రం గల్లా పవన్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

జనసేన ట్వీట్‌ చేసిన వెంటనే గల్లా స్పందించారు. తాను లోక్‌సభలో సెంచరీ కొట్టానని, గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు 100 సార్లు మాట్లాడానని ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద, ప్రధానిపైన యుద్ధం చేస్తూనే ఉన్నామని అందులో పేర్కొన్నారు. మరి పవన్ మాత్రం ప్రధానిపై ఎందుకు ఆధారపడుతున్నారో చెప్పాలని, ఇంతకీ ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ బ్యాటరీల గురించి చెప్పాలంటే, అవెప్పుడూ ఫుల్ చార్జింగ్‌తో ఉంటాయని స్పష్టం చేశారు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని, నిజంగా అలాగే ఉంటాయని చేసిన ట్వీట్ వైరల్ అయింది.

అయినా పవన్ పార్టీలో ట్విట్టర్ హ్యాండిల్ ని ఎవరు మేనేజ్ చేస్తారో తెలియదు కాని వారు చేసే పనులు పవన్ నెట్టి మీదకి కొత్త తలనొప్పులు తెచ్చేవిగానే ఉన్నాయి. గల్లా మనల్ని ఏదో అన్నాడు కాబట్టి ఆయన్ని ఏదో అనేసేయాలి అనే ఉద్దేశ్యమే తప్ప అసలు మనం చేసే ఆరోపణలో విషయం ఉందా లేదా అనేది చుసుకోలా. ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకుడిగా ఓనమాలు దిద్దుతున్న పవన్ ఇలాంటి వారిని పెట్టుకుంటే తన అన్న లాగే వీలయినంత త్వరలో బిచాణా ఎత్తేయడం ఖాయం.ఎందుకంటారా గల్లా వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా ఒక్కసారే మాటలాడరు అనేది జనసేన ఆరోపణ కాని ఒక్కసారి గల్లా పార్లమెంట్ పెర్ఫార్మన్స్ రిపోర్ట్ చూసి ఈ ఆరోపణలు ట్వీట్ చెయ్యల్సింది… ఎందుకంటే మీరే చుడండి

ఇప్పటి వరకు గల్లా 105 చర్చల్లో పాల్గొని 432 ప్రశ్నలు వేసారు 84 శాతం అటెన్డేన్స్ ఉంది అలాగే 6 ప్రైవేటు మెంబెర్ బిల్స్ ప్రవేశ పెట్టారు. అయినా గల్లా మంచివాడు కాబట్టి అలా రిప్లై ఇచ్చారు కానీ ఒక రాజ్యసభ ఎంపీ అయిన నీ అన్న తెలుగు వారి కోసం కానీ, స్పెషల్ స్టేటస్ కోసం కానీ ఏమి చేసాడు అని అడిగితే పవన్-జనసేన ఏమి చెబుతాయో 6 ఏళ్ళ పదవి కాలంలో చాలా కస్టపడి 2 చర్చల్లో పాల్గొన్న చిరంజీవి, 32 శాతం అటెండెన్స్ తో ప్రైవేటు మెంబెర్ బిల్ అంటే ఏమిటో తెలియకుండా కలం గడిపారు..రాత్స్త్రం మొత్తం ప్రత్యేక హోదా ఉద్యమం తో రగులుతుంటే పార్లమెంట్ కి వెళ్లి తన వాణి వినిపించాల్సిన ఆయన సిరా షూటింగ్ కోసం సెలవలు కోరడం ఏంటో ? అంటూ నెటిజన్లు పవన్ మీదా, జనసేన మీదా జోకులు పేలుస్తున్నారు. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది మరి.