లవకుమార్‌ అంధుడు!

jr-ntr-blind-man-makeover-from-jai-lavakusa-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రంలో మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఆ మూడు పాత్రల్లో ఇప్పటికే జై పాత్ర రివీల్‌ చేయడం జరిగింది. విలన్‌గా జై పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. ఇక లవ మరియు కుశ కుమార్‌లు ఎలా ఉంటారా అని ప్రేక్షకులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే నేడు రాఖీ సందర్బంగా లవ కుమార్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్స్‌ను చూస్తుంటే ఒక్కటి మాత్రం క్లీయర్‌గా అనిపిస్తుంది. లవకుమార్‌ అంధుడు అని, ఏమీ చూడలేడు అనిపిస్తుంది.

సినిమా ప్రారంభం సమయంలోనే ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో ఒక పాత్రకు కళ్లు ఉండవని ప్రచారం జరిగింది. అసలు చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా లీక్‌ చేశారు అనే టాక్‌ కూడా ఉంది. ఆ విషయం ఇప్పుడు తేలిపోయింది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ చూపు చూస్తుంటే ఖచ్చితంగా అంధుడు అయ్యి ఉంటడు అనిపిస్తుంది. కాస్త తేడాగా చూపు పెట్టిన ఎన్టీఆర్‌ లుక్‌ అదిరిపోయింది. టీజర్‌ వస్తుందనుకుంటే ఇలా పోస్టర్‌ను విడుదల చేయడంతో నందమూరి ఫ్యాన్స్‌ కాస్త డిసపాయ్యింట్‌ అవుతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేధాలు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి సారి ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ల కాంబినేషన్‌లో సినిమా వస్తుంది కనుక ఫ్యాన్స్‌ పిచెక్కి పోయి ఉన్నారు. ఖచ్చితంగా భారీ విజయం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు.

మరిన్ని వార్తలు:

వచ్చే ఏడాది సీఎంగా రజినీకాంత్‌!

ప్రభాస్‌ పెళ్లి కోసం ఆయన చెల్లెల్ల ఆరాటం