#RRR లో ఎన్‌టి‌ఆర్ ముస్లీం బందిపోటు…!

Jr NTR Turns Muslim For RRR Movie

బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి తన తరువాత సినిమాను ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోస్ గా ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీ స్టారర్ చిత్రాని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యినా కానుండి ఏదో ఒక్క రూపంలో సోషల్ మీడియా లో నిలుస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర గురుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో తెగవార్తలు వచ్చాయి. ఆర్ ఆర్ అర్ చిత్రం కథ ఇండియా కు స్వాతంత్రం రాకముందునాటి కథని ఆ మద్య వార్తలు భాగావచ్చాయి. కానీ ఇంతవరకు అది నిజమో కాదోని కూడా ఎవ్వరికి తెలవదు. రాజమౌళి నోరు విప్పితే తప్ప. అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఓ దొంగ పాత్రలో కనిపిస్తాడని. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చేశాడు రీసెంట్ గా ఎన్టీఆర్ పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఓ ముస్లిం యువకుడిగా కనిపిస్తాడు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ గురుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ రామ్ చరణ్ లుక్ పైన మాత్రం ఎటువంటి న్యూస్ మాత్రం రాలేదు. తాజాగా చరణ్ లుక్ పైన ఫిల్మ్ నగర్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది చరణ్ ఈ చిత్రంలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడంట. ఇంకా చరణ్ కు బాబాయ్ గా ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. ఈ చిత్రం గురుంచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీటి గురుంచి పూర్తి వివరాలు తెలవాలంటే రాజమౌళి నోరు విప్పాలిసిందే. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నది. ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.