హైకోర్ట్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు వేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత

హైకోర్ట్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు వేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఏపీలో ఎన్నికలైపోయాక జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెర్కెక్కిస్తున్నట్టు అర్ధమవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్‌ని కూడా కాస్త భిన్నంగా ఆలోచించిన ఆర్జీవీ అందుకు తగ్గటుగానే పాత్రలను కూడా ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రెండు ట్రైలర్లు కూడా ఎన్నో వివాదాలకు దారీ తీస్తున్నాయి. అయితే ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకులకు రాబోతున్న తరుణంలో మరో సమస్య తలెత్తింది.

అయితే ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే విధంగా చూపించారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, రామ్‌గోపాల్‌ వర్మ, జబర్దస్త్‌ కమెడియన్‌ రాము తదితరులను చేర్చారు. అయితే ఈ పిటీషన్‌పై నేడు హైకోర్ట్ విచారణ జరపనుంది.