చందమామ సూర్పణక కాబోతుందా?

Kajal Agarwal acts in Epic movie in Ramayana Surpanakha Role

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కాజల్‌ మరో పౌరాణిక చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చందమామ చిత్రంతో తెలుగులో స్టార్‌డంను దక్కించుకున్న కాజల్‌ ‘మగధీర’ చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ క్రేజ్‌ను దక్కించుకుంది. గత కొంత కాలంగా కాస్త తక్కువ సినిమాల్లో నటిస్తున్న కాజల్‌కు ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అది కూడా ఒక పౌరాణిక చిత్రం అవ్వడం విశేషం. రామాయణంలో సూర్పణక గురించి తెలియని వారు ఉండరు. ఎంతో ప్రముఖమైన ఆ పాత్రను బేస్‌ చేసుకుని ఒక చిత్రాన్ని చేసేందుకు ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. రావణాసూరుడి చెల్లి అయిన సూర్పణక అందం గురించి వాల్మికి రామాయణంలో రాయడం జరిగింది. ఆ విషయాన్ని బేస్‌ చేసుకుని దర్శకుడు కథ అల్లుతున్నట్లుగా తెలుస్తోంది.

సౌత్‌లో మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కించడంతో పాటు బాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రాముడు, రావణాసురుడి పాత్రలు కనిపించబోతున్నాయి. అయితే వారు గెస్ట్‌ రోల్స్‌గా మాత్రమే ఉంటారు. ఎక్కువగా సూర్పణక పాత్రపైనే సీన్స్‌ ఉంటాయని సమాచారం అందుతుంది. మొత్తానికి కాజల్‌ సూర్పణక పాత్రకు దాదాపుగా ఎంపిక అయినట్లే అని, ఇదో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. మోడ్రన్‌ అమ్మాయిగా, సూర్పణకగా కాజల్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. వార్త చదువుతుంటేనే చాలా ఆసక్తిగా ఉంది కదా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. 2020వ సంవత్సరంలో కాజల్‌ సూర్పణకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.