తేజూ మరింత వెనక్కు తీసుకు వెళ్లబోతున్నాడట!

Sai Dharam Tej Upcoming Movie Sri Krishnadevaraya

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక విభిన్నమైన ట్రెండ్‌ నడుస్తోంది. ప్రేక్షకులను భూత కాలానికి తీసుకు వెళ్లి అప్పటి పరిస్థితులను, అప్పటి పద్దతులను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బయోపిక్‌లతో పాటు పలు పౌరాణిక చిత్రాలు మరియు ఫాంటసీ చిత్రాలతో గతంలోకి తీసుకు వెళ్లడం జరుగుతుంది. ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రంలో 1980లలోకి తీసుకు వెళ్లారు. సైరా చిత్రంలో స్వాతంత్య్రానికి పూర్వం పరిస్థితులను చూపించేందుకు సిద్దం అవుతున్నాయి. శర్వానంద్‌, నాని, సాయి పల్లవి ఇలా పలువురు కూడా గతంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లబోతున్నారు. అయితే వీళ్లంగా 19వ శతాబ్దంలోనే ఉంటున్నారు. అయితే త్వరలో వీరు పోట్ల శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటికి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తొస్తోంది.

సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకు పోతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ రేపు ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఫలితం తర్వాత సంగతి కాని ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వీరు పోట్ల దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక ఫాంటసీ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రంలో ఎక్కువ శాతం సీన్స్‌ శ్రీకృష్ణ దేవరాయళ కాం నాటి నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లుగా తొస్తోంది. అయితే ఈ చిత్రంలో మాత్రం శ్రీకృష్ణ దేవరాయు కనిపించడు. అది రాయల కాలం అంటూ స్టోరీ సాగుతుంది తప్ప రాయలు, రాజ్యం, రాజ్యసభ, దర్బారు, రాజ భవనాలు ఏమీ ఉండవు. రాయల కాలంలో ఒక ఊర్లో జరిగిన కథను చూపించబోతున్నారు. చెబుతుంటేనే ఆసక్తిగా అనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాయి ధరమ్‌ తేజ్‌ ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయమై కూడా ఆసక్తిని మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వీరు పోట్ల స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు.