షాక్ లో ఉన్నకాజల్ అగర్వాల్

షాక్ లో ఉన్నకాజల్ అగర్వాల్

భారతీయుడు 2 చిత్ర సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈవీపి స్టూడియోస్ లో సెట్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు ఉన్నటువంటి క్రేన్ ఒక్కసారిగా తెగి పడటం తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ విషయం ఫై స్పందించిన కాజల్ అగర్వాల్ చాల భావోద్వేగానికి గురైంది. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో కాజల్ అక్కడే ఉందట, అదే విషయాన్నీ తన అభిమానులతో కాజల్ పంచుకున్నారు.

ఈ ఘటన గురించి ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి నాకు మాటలు రావడం లేదని అన్నారు. ప్రమాదం లో నా ముగ్గురు కొలీగ్స్ ని కోల్పోయాను. కృష్ణ, చంద్రన్, మధు కుటుంబాలు దైర్యం గా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు. అయితే నిన్న జరిగిన ప్రమాదంలో వెంట్రుక వాసిలో తప్పించుకున్నాను కాబట్టే ఇపుడు ట్వీట్ చేయగలుగుతున్నాను అని అన్నారు. అయితే ఈ ప్రమాదం ద్వారా సమయం, జీవితం గురించి పెద్ద గుణపాఠాలు నేర్చుకున్నాను అని కాజల్ అన్నారు.