త‌మిళ క్వీన్ కాజ‌ల్ అగర్వాల్…

kajal agarwal New Look Movie paris paris First Look Released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించిన క్వీన్ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని కోలీవుడ్ ఎన్నాళ్ల‌నుంచో ప్ర‌య‌త్నిస్తోంది. మొద‌ట త‌మ‌న్నా క్వీన్ రీమేక్ లో హీరోయిన్ గా న‌టిస్తోంద‌ని, త్వ‌ర‌లో సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని కూడా ఆరేడు నెల‌ల క్రితం కోలీవుడ్ మీడియా లో వార్త‌లొచ్చాయి. కానీ ఏ కార‌ణంచేత‌నో అప్పుడు సినిమా మొద‌లు కాలేదు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు ఎవ‌రూ క్వీన్ గురించి మాట్లాడ‌లేదు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతోంది. అయితే క్వీన్ పాత్ర త‌మ‌న్నాకు బ‌దులు కాజ‌ల్ అగ‌ర్వాల్ ను వ‌రించింది. త‌మిళ క్వీన్ కు చిత్ర‌బృందం పారిస్ పారిస్ అనే టైటిల్ ఖ‌రారు చేసింది. సినిమాలో హీరోయిన్ ఎక్కువ‌భాగం ప్యారిస్ లోనే గడుపుతుంది. అందుకే ఆ టైటిల్ ఖ‌రారు చేశారు.

పారిస్ పారిస్ లో కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్ ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమాకు ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు ర‌మేశ్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆదివారం ఉద‌యం ఫేస్ బుక్ లైవ్ ద్వారా సినిమాకు సంబంధించిన పూర్తివివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. క్వీన్ సినిమాతో బాలీవుడ్ లో కంగ‌నా ర‌నౌత్ పేరు మార్మోగింది. ఆమె న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కంగ‌నా కెరీర్ క్వీన్ కు ముందు, త‌ర్వాత అన్నంత‌గా మారిపోయింది. ఆమెకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల హీరోయిన్ గా ఇమేజ్ వ‌చ్చింది. మ‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ కు త‌మిళ్ లో పారిస్ పారిస్ ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.