కాజల్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డ్‌

Kajal Agarwal Recorded With 50 Films

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Kajal Agarwal Recorded With 50 Films

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కాజల్‌ ఈ పది సంవత్సరాల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో, చిన్న హీరోలతో నటించి మెప్పించింది. తాజాగా చిరంజీవి వంటి సీనియర్‌ హీరోతో కూడా నటించి ఈ అమ్మడు స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకుంది. దాదాపు పది సంవత్సరాలుగా స్టార్‌ స్టేటస్‌ను అనుభవిస్తున్న కాజల్‌ తాజాగా నటిస్తున్న ‘నేనేరాజు నేనే మంత్రి’ చిత్రంతో 50 చిత్రాలను పూర్తి చేసుకుంది.

అప్పట్లో హీరోయిన్స్‌ సినిమాలు ఎక్కువ చేసేవాళ్లు. కాని ప్రస్తుతం హీరోయిన్స్‌ లైఫ్‌ స్పాన్‌ చాలా తక్కువ. దాంతో పది పదిహేను సినిమాల్లో చేస్తే అదే గొప్ప అవుతుంది. కాని కాజల్‌ మాత్రం ఏకంగా 50 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోయిన్స్‌లలో ఈ స్థాయిలో సినిమాలు చేసిన మరో హీరోయిన్‌ ఎవరు లేరు అంటే అతిశయోక్తి లేదు. కొన్ని సినిమాలకే హీరోయిన్స్‌ ఫేడ్‌ అవుతున్న ఈ సమయంలో కాజల్‌ మాత్రం సుదీర్ఘ కాలంగా నటిస్తూ వస్తూ, 50 సినిమాలను క్రాస్‌ చేయడం ప్రశంసనీయం. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌ను కూడా చేసేందుకు ఈ అమ్మడు ముందుకు వస్తుంది. నేడు కాజల్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా కాజల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాం.