అనంతలో పరిటాల హవాకు తెరపడినట్లేనా..?

Chandrababu checked into the Paritala Sunitha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Chandrababu Checked Into The  Paritala Sunitha In The Anantha Judge

నంత జడ్పీలో పరిటాల సునీత హవాకు చెక్ పెట్టారు చంద్రబాబు. చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా పార్టీ కంటే తన వ్యక్తిగత అనుచరులకే ప్రాధాన్యమివ్వాలన్న ఆమె డిమాండ్ నెరవేరలేదు. ముందుగా అనుకున్నట్లే చమన్ ఛైర్మన్ గిరీ ముగిసిందని, మిగతా రెండేళ్లు వేరే వాళ్లకు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు తేల్చిచెప్పడంతో పరిటాల వర్గం నిరాశలో కూరుకుపోయింది.

పరిటాల రవి ఉన్నప్పుడు అనంతలో గెలుపు బాధ్యతలు తీసుకునేవారు. అందుకుని ఆయన చెప్పినట్లే పదవులు చెప్పినవారికి దక్కేవి. కానీ సునీత ఆ స్థాయిలో కాదు కదా కనీసం తన సొంత నియోజకవర్గాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నారని, కానీ ఆధిపత్యం మాత్రం రవి స్థాయిలో కావాలంటే ఎలా కుదురుతుందని బాబు గతంలోనే చాలాసార్లు క్లాస్ తీసుకున్నారట. ఇక సునీత కుమారుడు పరిటాల శ్రీరాం కూడా అపరిపక్వతతో కేసులు కొనితెచ్చుకోవడం ఆయనకు నచ్చడం లేదట.

మొత్తానికి అనంతపురం జడ్పీ చైర్మన్ పదవి విషయంలో పరిటాల పంతం నెరవేరలేదు. పరిటాల రవికి సన్నిహితుడిగా పేరు పొందిన, ప్రస్తుతం పరిటాల సునీత అనుచరగణంలో సభ్యుడిగా ఉన్న అనంతపురం జడ్పీ చైర్మన్ చమన్ ను తప్పించడానికే బాబు డిసైడ్ చేశారు.

మరిన్ని వార్తలు :

కాంగ్రెస్ పతనానికి వీర్రాజు కనిపెట్టిన కారణం

రాహుల్ అండతో ప్లాన్లు గీస్తున్న కాంగ్రెస్