అల్లరి నరేష్ పక్కన కాజల్ అగర్వాల్

అల్లరి నరేష్ పక్కన కాజల్ అగర్వాల్

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయాన్నీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలియజేసారు. మీడియా లో వస్తున్న వార్తల ఫై స్పందించిన సురేష్ బాబు ఆ విషయాన్నీ కన్ఫార్మ్ చేసారు. అల్లరి నరేష్, కాజల్ అగర్వాల్ కలిసి నటించనున్న విషయాన్నీ మీడియా తో తెలిపారు. కాజల్ అగర్వాల్ ని సంప్రదించగా తాను సరే అని చెప్పినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉన్న ఈ రీమేక్ చిత్రం ఇంకా అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవల్సి ఉంది అని అన్నారు.

ప్రస్తుతం భారతీయుడు, ముంబై సాగా లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ త్వరలో డాన్సింగ్ క్వీన్ రీమేక్ పేరిట అల్లరి నరేష్ తో నటించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ చిత్రం గురించి కాజల్ అగర్వాల్ పలు ఆసక్తికర విషయాలని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ కి సంతకం చేయడం చాల థ్రిల్లింగ్ గా ఉందని, పాత్ర పరంగా ఇంకా సంతోషం గా ఉన్నాను అని తెలిపారు. అయితే ఈ చిత్రంలోని పాత్రకోసం ఒక విద్యని నేర్చుకోబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రం తన కెరీర్ కు మరింత బలాన్ని ఇస్తుంది అని తెలిపారు. అయితే అల్లరి నరేష్ సుడిగాడు చిత్రం తర్వాత హిట్ కొట్టిన దాఖలాలు లేవు, మహేష్ బాబు తో మహర్షి చిత్రంలో కీలక పాత్రని పోషించారు. అయితే అల్లరి నరేష్ పక్కన కాజల్ అంగీకరించడం తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫై సినీ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.