ఆపరేషన్‌ చేయించుకుని తగ్గించుకుంది

kajal Aggarwal gone Operation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎప్పుడో ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ కాజల్‌. ‘మగధీర’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకుంది. ఆ సినిమా తర్వాత కాజల్‌ వెనుదిరిగి చూసుకోలేదు. రెండు సంవత్సరాల వరకు కూడా కాజల్‌  తెలుగు మరియు తమిళంలో బిజీ హీరోయిన్‌. అయితే రెండు సంవత్సరాలుగా కాజల్‌కు అవకాశాలు కాస్త తగ్గాయి. తనకున్న పరిచయాలతో అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఎమ్మెల్యే చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా నటిస్తుంది. 

కాజల్‌కు ఈ రెండు చిత్రాల తర్వాత మళ్లీ అవకాశాలు రాకపోవచ్చు అని కొందరు అంటున్నారు. అయితే ఇంకా నటించాలనే కోరికతో ఈమె తన పెద్దగా ఉన్న ముక్కును తగ్గించుకుని మరింత అందంగా తయారైంది. అమెరికాలో దాదాపు 15 రోజుల పాటు ఉండి ముక్కు సర్జరీ చేయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆపరేషన్‌ తర్వాత కాజల్‌ ముక్కుకు, అంతకు ముందు ముక్కుకు చాలా తేడా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో పాత మరియు కొత్త ఫొటోలు యాడ్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారు. అయితే కాజల్‌ మాత్రం తన ముక్కు ఆపరేషన్‌ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన కాని, వ్యాఖ్యలు కాని చేయలేదు.

మరిన్ని వార్తలు