వెబ్‌ మీడియాకు హరీష్‌ శంకర్‌ ఛాలెంజ్‌

Director Harish Shankar Open Challenge to Web Media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Director Harish Shankar Open Challenge to Web Media

‘డీజే’ చిత్రం ఏ ముహూర్తన ప్రారంభం అయ్యిందో కాని మొదటి నుండి వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటుంది. సినిమా విడుదలకు ముందే బ్రహ్మణులను ఈ సినిమాలో అవమానపర్చుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మణ సంఘాల వారు ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాని అది సాధ్యపడలేదు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే టాక్‌ వచ్చింది. అయితే వెబ్‌ మీడియాలో మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోలేదని, ఎక్కువ శాతం వెబ్‌ సైట్లు సినిమాకు దారుణమైన రేటింగ్‌ ఇచ్చారు. ఇక ఆ తర్వాత డీజే కలెక్షన్స్‌ ఫేక్‌ అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ కలెక్షన్స్‌ ఫేక్‌ అని, సినిమా స్థాయిని పెంచేందుకు, సినిమాకు పబ్లిసిటీ కోసం కలెక్షన్స్‌ను పెంచి చూపుతున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఆ వాదనను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేస్తూ వస్తున్నారు. తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ కలెక్షన్స్‌పై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. వెబ్‌ మీడియా వారు ఎవ్వరైనా కూడా ‘డీజే’ కలెక్షన్స్‌ ఫేక్‌ అని నిరూపిస్తే తాను సినిమాలకు గుడ్‌ చెప్తాను అంటూ సంచలన ప్రకటన చేశాడు. నేను చెత్త విమర్శలను పట్టించుకోను అని, తాను ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు:

‘డీజే’ వృదా ప్రయత్నం.. మరింత నష్టం

భాను ఈజ్‌ బ్యాక్‌.. చాలా మార్పు