‘డీజే’ వృదా ప్రయత్నం.. మరింత నష్టం

DJ movie Flap In Overseas Market By Collecting 6.5 crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

DJ movie Flap In Overseas Market By Collecting 6.5 crores

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘డీజే’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. మొత్తంగా 135 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారి నుండి సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో మాత్రం దారుణంగా ఫ్లాప్‌ అయ్యింది. ముక్కీ మూలిగి మిలియన్‌ మార్క్‌ అంటే 6.5 కోట్లను వసూళ్లు చేసిన ‘డీజే’ చిత్రం ఎంత ప్రయత్నించినా కూడా 10 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ కాలేక పోయింది. 9 కోట్లకు ఓవర్సీస్‌ రైట్స్‌ను దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్‌ భారీ నష్టాలను చవి చూస్తున్నాడు.

వచ్చిన నష్టాలు చాలవు అన్నట్లు ఇప్పుడు ఆయన నెత్తిన మరో భారంను ‘డీజే’ యునిట్‌ సభ్యులు పెట్టారు. అదే ‘డీజే’ టీం అమెరికా యాత్ర. ‘డీజే’ చిత్రానికి చెందిన దాదాపు పది మంది టీం అమెరికాలో పబ్లిసిటీ కోసం వెళ్లారు. అక్కడ వీరి ఖర్చులు డిస్ట్రిబ్యూటర్‌ భరించాల్సి ఉంటుంది. వీరి రాకతో అయినా కలెక్షన్స్‌ పెరుగుతాయని ఆ డిస్ట్రిబ్యూటర్‌ భావించాడు. కలెక్షన్స్‌ పెరగక పోగా మరింతగా నష్టాలు వస్తున్నట్లుగా ఆయన వాపోతున్నాడు. డీజే టూర్‌ కోసం దాదాపు 50 లక్షలను ఆ డిస్ట్రిబ్యూటర్‌ ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చిన కలెక్షన్స్‌ నుండే ఖర్చు చేస్తుండటంతో మరింతగా నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది.

మరిన్ని వార్తలు:

శివాజీ రాజా ఒక జోకర్‌ : తులసి