దాసరి బయోపిక్ కూడా వస్తోంది.

o kalyan plans to make dasari narayana rao biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ బయోపిక్ గురించి వర్మ చేసిన ప్రకటన తాలూకా ప్రకంపనలు ఆగకముందే దర్శకరత్న దాసరి నారాయణరావు జీవిత చరిత్ర అంశం కూడా ముందుకు వచ్చింది. దాసరి బయోపిక్ తీయబోతున్నట్టు ఆయన శిష్యుడు కళ్యాణ్ ప్రకటించారు. ఒకప్పుడు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఓ. కళ్యాణ్ చిత్ర సీమలో దాసరి శిష్యుడిగా అందరికీ పరిచయమే. దాసరి సినీ, వ్యక్తిగత జీవితం లోని అన్ని కోణాల్ని స్పృశించే విధంగా ఈ సినిమా ఉంటుందని కళ్యాణ్ తెలిపారు. ఇంకా ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఫైనలైజ్ కాలేదు. దాసరి శిష్యుల్లో ఎవరో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వుంది.

దాసరి బయోపిక్ లో కూడా వివాదాస్పద అంశాలు ఉంటాయా లేదా అన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. చిరంజీవితో వివాదం, చిన్న సినిమాలకు అనుకూలంగా పెద్ద నిర్మాతలతో ఢీకొట్టడం వంటి విషయాలతో పాటు చిత్ర సీమకి చెందిన ఎన్నో లోగుట్లు దాసరి బయోపిక్ తో బయటికి వచ్చే అవకాశం వుంది.

  మరిన్ని వార్తలు 

మా టీవీ ఉద్యోగులకి చిరు దెబ్బ?

బిగ్‌ బాస్‌ షో ఒక దరిద్రమైన షో

అబ్బాయి టైటిల్‌పై బాబాయి ఆసక్తి