అబ్బాయి టైటిల్‌పై బాబాయి ఆసక్తి

NTR Missed That Ruler Title, Balayya Gets It

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

NTR Missed That Ruler Title, Balayya Gets It

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దమ్ము’ చిత్రంలోని ‘రూలర్‌’ పాట ఆ మద్య బాగా ఫేమస్‌ అయ్యింది. ఆ పాటలోని పదం అయిన రూలర్‌ను ఎన్టీఆర్‌ తర్వాత సినిమాకు టైటిల్‌గా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం ఆ టైటిల్‌ను కాదన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ఎన్టీఆర్‌ హీరోగా ‘రూలర్‌’ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయని అంతా భావించారు. అయితే ఎన్టీఆర్‌ ఆ టైటిల్‌ను వాడుకోవడం లేదు కనుక బాలయ్య దాన్ని యూజ్‌ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేస్తున్న బాలయ్య ఆ తర్వాత తమిళ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. 

తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యింది. సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న ఆ సినిమాకు ‘జయసింహా’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారు. దాంతో పాటు రెడ్డి గారు మరియు రూలర్‌ టైటిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జయసింహా గురించి ఎక్కువ చర్చ జరిగింది. ‘రూలర్‌’ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కథానుసారంగా టైటిల్‌ను నిర్ణయించాలనే ఉద్దేశ్యంతో ‘రూలర్‌’ను ఫిక్స్‌ చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా భావిస్తున్నారు. అతి త్వరలోనే టైటిల్‌ ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

ఆలూలేదు సూలులేదు..