రాహుల్ కు మూడొచ్చింది

rahul twitted on h1b visas and narendra modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఫారిన్ టూర్లకు వెళ్లినప్పుడల్లా.. రాహుల్ గాంధీలోని కొత్త మనిషి నిద్రలేస్తుంటాడు. ఇండియాలో ఎప్పుడూ నిస్తేజంగా ఉండే రాహుల్.. విదేశాల్లో మాత్రం తెగ ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు మోడీని సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టారని కాంగ్రెస్ నేతలు ఆనందపడిపోతున్నారు.

అమెరికా వెళ్లి ట్రంప్ తో డిన్నర్ చేసిన మోడీ వీసాల గురించి ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ నిలదీశారు. ఇది ఓ రకంగా మోడీని కూడా ఇబ్బంది పెట్టే పరిణామమే. మామూలుగా అయితే రాహుల్ బాబు అంటూ బీజేపీ నేతలు ఆడుకునేవారు. కానీ ఈ ట్వీట్ కు మాత్రం కాషాయ పార్టీ దగ్గర రిప్లై లేదు.

రాహుల్ చేసిన ట్వీట్ బీజేపీలో కలకలం రేపితే… కాంగ్రెస్ లో సంతోషం పెంచింది. గతంలో ఫారిన్ నుంచి వచ్చాకే యువరాజులో మార్పొచ్చిందని, ఇప్పుడు ఏకంగా ఫారిన్ టూర్లోనే మోడీని ఇరుకునపెడుతున్నారంటే.. ఇక వచ్చాక ప్రధానికి చుక్కలు చూపిస్తారని హస్తం నేతలు సంబరపడిపోతున్నారు.