ఇజ్రాయెల్ లో మర్యాద.. మర్యాద

israeli PM Benjamin Netanyahu Giving big honor to PM Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమ దేశానికి వచ్చిన తొలి భారత్ ప్రధానికి ఇజ్రాయెల్ స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తోంది. ఘనమైన మర్యాదలు చేస్తూ… తెగ గౌరవించేస్తోంది. పోప్, అమెరికా అధ్యక్షుడితో సమానంగా మోడీని చూసుకోవడంపై భారత అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మోడీకి మర్యాదివ్వడం వెనుక లెక్క వేరే ఉంది.

ఆయుధ మార్కెట్ ను గుప్పిట పట్టాలని భావిస్తున్న ఇజ్రాయెల్… అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారైన భారత్ తో వీలైనన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకు మోడీ సుముఖంగా ఉండటంతో… ఆయన్ను ఆకాశానికెత్తోస్తోంది.
ఇక మోడీకి కేటాయించిన సూట్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. క్షిపణి దాడులు, రసాయన దాడులు జరిగినా… మోడీకి ఏమీ కాదు. మోడీ ఉండే ప్రతిచోటా పువ్వులతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. మోడీని ఇంత గౌరవిస్తున్న ఇజ్రాయెల్… ఆశించినది దక్కకపోయినా… ఇంతే ఉంటుందా అనేది ఆసక్తికరం.

  మరిన్ని వార్తలు 

కూతురి కోసం దిగజారుతున్నారా..?

తిమ్మిని బమ్మిని చేసిన వెంకయ్య

చంద్రబాబుకు ఒకే ఒక కోరిక