ఆలూలేదు సూలులేదు..

Raj Mouli And Mahesh Babu Next Combination Movie Fake News

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Raj Mouli And Mahesh Babu Next Combination Movie Fake News

కొన్ని వార్తలు చిత్ర విచిత్రంగా పుడుతాయి. ఆ వార్తలు నిజమేనేమో అనిపిస్తాయి, కాని కాస్త లోతుగా ఆలోచిస్తే అదెలా సాధ్యం అనిపిస్తుంది. తాజాగా సోషల్‌ మీడియాలో రాజమౌళి, మహేష్‌బాబుల సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు. దాంతో ఆయన త్వరలో మహేష్‌బాబుతో హిందీలో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం సినీ వర్గాల్లో సైతం ఈ వార్త గురించి చర్చ జరుగుతుంది. కాని ఈ వార్త పక్కా పుకారు.

రాజమౌళి తన తర్వాత సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దానయ్య నిర్మాణంలో తాను ఒక సినిమా చేస్తాను అంటూ కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అది ఎప్పుడు ఉండేది ఇంకా ఒక క్లారిటీ లేదు. ఆ తర్వాత ఎన్వీప్రసాద్‌ నిర్మాణంలో మహేష్‌బాబు హీరోగా రాజమౌళి సినిమా ఉండనుంది. అంటే రాజమౌళి, మహేష్‌బాబుల కాంబో మూవీకి ఇంకా ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పడుతుంది. ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా జరగవచ్చు. అప్పటి సినిమా గురించి ఇప్పుడే వార్తలు వెలువడటం నిజంగా విడ్డూరంగా ఉంది. అది కూడా హిందీలో అంటే మరింత చిత్రంగా ఉంది. ఇలాంటివి ఫ్యాన్స్‌ సరదాగా పుట్టిస్తే వాటిని మీడియా పెద్దగా చేస్తుంది.
మరిన్ని వార్తలు:

మరిన్ని వార్తలు:

వర్మ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదా?

తమ్ముడి కర్మకాండ నిర్వహించాడు