వర్మ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదా?

varma didn't confirmation about ntr bio pic movie direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ బయోపిక్ గురించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రకటన, ఆడియో కామెంటరీ, పాట ఇప్పటికే జనం ముందుకు వచ్చాయి. కానీ ఇలాంటి విషయాలు బయటికి చెప్పడానికి ఉత్సాహపడే నందమూరి బాలయ్య మాత్రం ఇంకా దీనికి సంబంధించి ఓ ప్రకటన ఇవ్వలేదు. ఆయన ఇటు ఔనన లేదు,అటు కాదనలేదు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి సంబంధించి మార్పులకి అవకాశం ఉందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వాటిని బలపరిచేలా మాట్లాడారు మంత్రి లోకేష్. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడుగా వర్మ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదన్నట్టు మాట్లాడారు లోకేష్.

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య నటిస్తున్నాడు కాబట్టి ఆ సినిమా విజయం మీద ఏ అనుమానాలు అక్కర్లేదని లోకేష్ విజయవాడలో వ్యాఖ్యానించారు. ఇటీవల బాలయ్య బర్త్ డే వేడుకల కోసం పోర్చుగల్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన తమ మధ్య వచ్చినట్టు లోకేష్ వెల్లడించారు. అయితే దర్శకుడు గురించి తాము మాట్లాడుకోలేదని అన్నారు. అయినా దర్శకుడు ఎవరైనా ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి సినిమా హిట్ అయి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు లోకేష్.