తాప్సి మళ్లీ బిజీ అయ్యేనా?

tapsee new movie anando brahma release on august 18

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగులో మంచు హీరో మనోజ్‌తో తెరంగేట్రం చేసిన తాప్సి పలువురు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. కాని తాప్సికి మాత్రం పెద్దగా లక్‌ కలిసి రాలేదు. అయినా కూడా నిరుత్సాహ పడకుండా తెలుగులో ప్రయత్నాలు చేసింది. మెల్ల మెల్లగా తొగులో అవకాశాలు కనుమరుగవుతున్న సమయంలో బాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చింది. అక్కడ చిన్నా చితక చిత్రాలతో పాటు కొన్ని పెద్ద చిత్రాలను కూడా చేసే అవకాశం దక్కించుకుంది. ముఖ్యంగా అమితాబచ్చన్‌ వంటి స్టార్‌తో నటించే అవకాశాన్ని ఈమె పొందింది. దాంతో మళ్లీ తెలుగులో ఈమెకు రీ ఎంట్రీ దక్కింది. 

తెలుగులో తాజాగా ‘ఆనందో బ్రహ్మా’ అనే చిత్రాన్ని ఈ అమ్మడు చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌ ఇలా పలువురు కమెడియన్స్‌ నటించిన హర్రర్‌ కామెడీ చిత్రంలో తాప్సి ముఖ్య పాత్రను పోషించింది. ఈ సినిమాతో తాప్సి మళ్లీ తెలుగులో జెండా పాతాలని ఆశిస్తుంది. ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే సినిమా ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా సినిమా సక్సెస్‌ అయితే ఈమెకు తెలుగులో మళ్లీ ఆఫర్లు వస్తాయని సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే ఆ సినిమా సక్సెస్‌ కావడమే ఇప్పుడు ఆమెకు పెద్ద కష్టం. ఇటీవల హర్రర్‌ కామెడీ సినిమాలు చాలా రొటీన్‌గా ఉంటున్నాయి. మరి ఈ సినిమా కూడా అంతే రొటీన్‌గా ఉంటే ప్రేక్షకులు తిరష్కరించడం ఖాయం. వచ్చే నెల 18న విడుదల కాబోతున్న ‘ఆనందో బ్రహ్మా’ చిత్రం తాప్సి కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుంది అనేది చూడాలి.

మరిన్ని వార్తలు