మా టీవీ ఉద్యోగులకి చిరు దెబ్బ?

Chiru Meelo Evaru Koteeswarudu show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు మా టీవీ యజమానుల్లో ఒకరిగా ఆ సంస్థ ఉద్యోగులకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం. మా టీవీ ని స్టార్ యాజమాన్యం కొనుక్కున్నాక కూడా ఆ బంధంలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి చిరు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని తెలిసి మా ఉద్యోగులు ఖుషీ అయ్యారు. అయితే ఆ కార్యక్రమం వారికి చేదు అనుభవాన్ని మిగల్చడంతో పాటు మొత్తంగా ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. అదెలాగంటే…

మా టీవీ ని టేక్ ఓవర్ చేసాక స్టార్ ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన కార్యక్రమం “మీలో ఎవరు కోటీశ్వరుడు”. చిరంజీవి ని బుల్లి తెర మీదకు తెస్తూ చేస్తున్న ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవుతుందని స్టార్ యాజమాన్యం భావించింది. అయితే అనుకున్న ఫలితం రాలేదు. దీనికి కారణం ఉద్యోగుల్లో సృజనాత్మకత లేకపోవడమే అని స్టార్ మా యాజమాన్యం భావించిందట. అందుకే మరో భారీ ప్రోగ్రాము బిగ్ బాస్ మొదలయ్యే లోపు వృత్తిలో వెనకబడ్డారన్న కారణంతో దాదాపు 80 మందికి స్టార్ మా యాజమాన్యం మంగళం పలికిందట. వీరిలో సంస్థతో ఏడెనిమిదేళ్ళకి పైగా బంధం వున్న ఉద్యోగులు కూడా వున్నారు. అయితే పరిహారం కాస్త భారీగానే రావడంతో ఉద్యోగులు కూడా ఎదురు మాట్లాడలేకపోయారట. మరి కొందరు సీనియర్ ఉద్యోగుల మెడ మీద కత్తి వేలాడుతోందట. వీరి స్థానంలో యువరక్తం తో సంస్థని నింపేందుకు స్టార్ మా ఇప్పటికే నియామక ప్రక్రియ మొదలెట్టిందట.

  మరిన్ని వార్తలు 

ఎన్టీఆర్ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో …

మీడియా తో రవితేజ… భరత్ మృతిపై?

చరణ్‌తో ‘స్పైడర్‌’..!