శివాజీ రాజా ఒక జోకర్‌ : తులసి

Actress Tulasi described Shivaji Raja as a Joker

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Actress Tulasi Described Shivaji Raja As A Joker

సీనియర్‌ నటి తులసి మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజాను ఒక జోకర్‌ అంటూ సంభోదించి సంచలనం సృష్టించారు. శివాజీ రాజా పదవి శాస్వతం అని భావిస్తున్నాడని, తాను ఆయన కంటే సీనియర్‌ను అనే విషయాన్ని మర్చి పోతున్నాడు అంటూ తులసి ట్విట్టర్‌ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన శివాజీరాజాకు తులసికి ఎక్కడ విభేదాలు వచ్చాయి అనేది అర్థం అవ్వడం లేదు. ఆ విషయాన్ని ఆయన నోరు తెరిస్తే కాని తెలియదు.

ఇటీవల తులసి శంకరాభరణం అవార్డు వేడుకను నిర్వహించింది. ఆ అవార్డు వేడుకకు మా ఆర్టిస్టులను వెళ్లకుండా శివాజీరాజా అడ్డుకున్నాడు. తులసిపై కోపంతోనే శివాజీ రాజా ఆ కార్యక్రమం ఫ్లాప్‌ అవ్వాలని నటీనటులను వెళ్లవద్దని సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు ఆయన అలా చేశాడు అనేది మాత్రం తెలియలేదు. ఒక సీనియర్‌ నటి, ప్రముఖ దర్శకుడి పేరు మీద అవార్డులు ఇవ్వబోతుండగా ఎందుకు ఆయన ఇలా ప్రవర్తించాడు అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తులసి మాత్రం ప్రస్తుతం శివాజీ రాజాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉంది. పదవిని చూసుకుని శివాజీ రాజా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆమె విమర్శించింది.

మరిన్ని వార్తలు:

బిగ్‌ బాస్‌ షో ఒక దరిద్రమైన షో

అబ్బాయి టైటిల్‌పై బాబాయి ఆసక్తి