ఆ 10 మంది పద్దతి మార్చుకోవాలి

Allu Aravind Sureshbabu Shocking Facts About Drugs Addiction In Tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Allu Aravind And Sureshbabu Shocking Facts About Drugs Addiction In Tollywood

టాలీవుడ్‌ సెలబ్రెటీలు డ్రగ్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ప్రముఖుల పిల్లలను టార్గెట్‌ చేసుకుని సినిమా పరిశ్రమకు చెందిన కొందరు డ్రగ్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు నిర్థారించారు. ఇటీవల ప్రముఖ కాలేజ్‌లలో డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లుగా విద్యార్థులను విచారించగా వెళ్లడైంది. ఆ డ్రగ్స్‌ను సినిమా పరిశ్రమకు చెందిన కొందరి నుండి విద్యార్ధులు తీసుకుంటున్నట్లుగా అనధికారికంగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇండస్ట్రీలో డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న వారు చాలా మందే ఉన్నారు అనే విషయం చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మా ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ మీడియా సమావేశంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, అల్లు అరవింద్‌, సురేష్‌బాబు, శ్రీకాంత్‌ ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన 10 మంది డ్రగ్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి పేర్లు ఏంటి అనే విషయం వెళ్లడి కాకుండానే వారు ఆ వ్యవహారం నుండి బయటకు రావాలని హెచ్చరించారు. ఆ పది మంది వల్ల మొత్తం ఇండస్ట్రీ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అల్లు అరవింద్‌ అన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న వారు సినీ పరిశ్రమలో ఉండటానికి అనర్హులు అంటూ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నుండి వారిని బహిష్కరించకుండా వారే ఆ వ్యవహారంకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో అయినా ఆ పది మంది పద్దతి మార్చుకుంటారేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

పిక్‌టాక్‌ : లంగాఓణీలో సమంత

జయ జానకి నాయక టీజర్ తో షాక్.