తాప్సి బలుపు వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి

Taapsee pannu made some controversial comments on Raghavendra Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తాప్సిని తెలుగులో హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు. తన మొదటి సినిమాలోనే కష్టాలు ఎదుర్కొన్నాను అంటూ రాఘవేంద్ర రావుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది తాప్సి. ఈ అమ్మడి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాతో పాటు ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాప్పికి లైఫ్‌ ఇచ్చిన ఒక గొప్ప దర్శకుడి గురించి చులకన వ్యాఖ్యలు చేయడంపై తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు అంతా కూడా ఖండిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి అని గ్రహించిన తాప్సి మరోసారి మీడియా ముందుకు వచ్చింది. 

తాప్సి మాట్లాడుతూ.. తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఆ విషయం రాఘవేంద్ర రావు గారికి కూడా తెలుసు, మేమిద్దరం బాగానే ఉన్నాం, మద్యలో మీడియా వారే అతి చేస్తున్నారు అంటూ మరోసారి బలుపు వ్యాఖ్యలు చేసింది. 100 సినిమాలకు పైగా దర్శకత్వం చేసిన ఒక దర్శకుడి గురించి ఎలా మాట్లాడాలో నాకు ప్రత్యేకంగా ఎవరు చెప్పనక్కర్లేదు. నాకు ఉన్న జ్ఞానం మెరకు ఆయనకు గౌరవం ఇచ్చి మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది. నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు, ఆయన గురించి తాను తప్పుగా మాట్లాడను అంటూ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం ఆమెకే చెల్లిందని సినీ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు

‘లై’ వర్కౌట్‌ అయ్యేలా ఉంది

పిక్‌టాక్‌ : లంగాఓణీలో సమంత