తెరాస కు కొత్త ప్రపోజల్ తిసుకువేల్లుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్

MAA Assosions New Proposal To TRS GOVT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ….తెరాస ప్రభుత్వం అఖండ మెజారిటితో అధికారం లోకి రావడం చాలా సంతోషంగా ఉన్నది. దిని వలన తాము మరిన్ని పనులు తెరాస ప్రభుత్వం ద్వారా చేయించుకునే అవకాశం ఉన్నదన్నారు. అలాగే జుబ్లిహిల్ల్స్ లో గెలిచినా మాగంటి గోపీనాథ్, ఎఫ్డీసీ చైర్మెన్ రామ్ మోహన్ రావు లకు సినిమా పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారి ద్వారా మాకు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుంది అన్నారు. అలాగే కెసిఆర్,కేటిర్, హరీష్ రావు లాంటి వారి వలన సినిమా పరిశ్రమకు గతంలోకూడా ఎన్నో మంచి పనులు చేశారు.

ఇక సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు ఉండటం చాలా మేలు చేస్తుంది అన్నారు. మూవీ ఆర్టిస్ట్ వాళ్ళం అందరం వెళ్లి తెరాస ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళుతాం. నేను ఆ మద్య సిద్ది పేట పరిసర ప్రాంతంలో షూటింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడి పల్లె వాతావరణం భాగా నచ్చింది. హైదరాబాద్ నుండి సిద్ది పేట కు రెండుగంటలు జర్నీ కావున అక్కడ హరీష్ రావు గారు సిద్ధిపేట ను ఎంతగానో అభివృద్ధి చేశారు. హరీష్ రావు గారిని కలిసి అక్కడే ఓ షూటింగ్ స్టూడియోని ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటున్నాం. అక్కడి వాతావరణం షూటింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. అలగే కెసిఆర్ గజ్వేల్ కూడా ఓ సినిమా కోచింగ్ సెంటర్ లాంటిది పెడితే కొత్త కళాకారులకు చాలా ప్లస్ పాయింట్ అవ్వుతుంది. ఈ రెండు ప్రతి పాధనలతో కెసిఆర్ వద్దకు వెళుతున్నాం అన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో చాలా మంది ఆర్ధికంగా వెనకపడి ఉన్నారు అలాంటి వారికీ కెసిఆర్ గారు ఓ పది ఎకరాలు స్థలం కేటాయిస్తే ఓల్డైజే హోం ని నిర్మిస్తాం ఇది మా డ్రీం ప్రాజెక్ట్, దీనికి సినిమా స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ , నాగార్జున, మహేష్,ఎన్టీఆర్ లాంటి వారిని సహాయం కోరుతున్నాం అన్నారు.