కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటి…!

Telangana Ministers Kcr

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ధంకా మోగించిన కేసీఆర్ ఆ వెంటనే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన బీజేపీ – కాంగ్రెస్ దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాయి. బుద్ధిలేకుండా పాలించాయి. మ‌న దేశం వెన‌క్కు పోయింది. నేను ప్ర‌జ‌ల ఫ్రంట్ ఏర్పాటుచేస్తాను? పార్టీల క‌లిపితే అదే దిక్కుమాలిన యూనిటీ ఏంది? క‌ల‌వాల్సింది పార్టీలు కాదు, ప్ర‌జ‌లు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఒడిసాకు వెళ్లి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ను క‌లిశారు. బెంగాల్‌కు వెళ్లి మ‌మ‌త‌ను క‌లిశారు. ఇంకా కొంద‌రిని క‌లుస్తార‌ట‌. అఖిలేష్, మాయావ‌తిని కూడా క‌లుస్తార‌ట‌. అంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంత‌న ఉందా? ద‌టీజ్ కేసీఆర్‌. చెప్పేవి మాత్ర‌మే శ్రీ‌రంగ నీతులు. ఆయ‌న తీరుపై ఈరోజు చంద్ర‌బాబు లాజిక్‌తో స‌హా విమ‌ర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు లేని ప్రత్యామ్నాయ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంటూ దేశమంతా తిరిగి ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నారంటే అర్థం ఏంటి? అని చంద్ర‌బాబు ప్రశ్నించారు.

కేసీఆర్ మోడీ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసే సాధ‌నం. బీజేపీ, కేసీఆర్ చేస్తున్న ప‌నులే వాళ్ల ఉద్దేశాలను బయటపెడుతున్నాయి. కేసీఆర్‌ వివిధ పార్టీల‌ను క‌లిసి ఇప్పుడు ప్రధాని మోడీని క‌లుస్తున్నాడు. అంటే ఎవ‌రెవ‌రితో ఏం మాట్లాడాడో, మోడీ ప్లాన్ అమ‌లు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిందో వివ‌రించ‌డానికి మోడీని క‌లుస్తున్నాడా? అని చంద్ర‌బాబు వ్యంగాస్త్రం వేశారు. కేసీఆర్ మోడీని కలుస్తున్నది రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమయితే ఇపుడే ఎందుకు పోతున్న‌ట్లు? నేరుగా ఢిల్లీకి ఎందుకు పోన‌ట్లు? అని బాబు ప్ర‌శ్నించారు. కేసీఆర్ పైకి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని బాబు వ్యాఖ్యానించారు. వ‌రుస శ్వేత‌ప‌త్రాల్లో భాగంగా అమరావతిలో నాలుగో శ్వేతపత్రం విడుదల చేశాక మోదీ-కేసీఆర్ భేటీపై మీడియా ప్రస్తావించగా బాబు స్పందించారు. ఫెడర్ ఫ్రంట్ లక్ష్యంగా దూకుడు పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుస పర్యటనలతో జాతీయ స్థాయి నేతల్ని కలుస్తున్నారు. ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రులను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు. తమతో కలిసి రావాలని.. ఫ్రంట్‌కు సహకరించాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం కేసీఆర్ ప్రధానిని కలవబోతున్నారు. ఈ భేటీపైనే చంద్రబాబు స్పందించారు.. కేసీఆర్‌పై సెటైర్లు పేల్చారు.