‘భారతీయుడు 2’కు నో చెప్పిన కమల్‌… కారణం ఇదే

Kamal Haasan Shankar Bharateeyudu movie in Dil Raju Production

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రెండు దశాబ్దాల క్రితం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘భారతీయుడు’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ తీసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. మరోసారి కమల్‌ శంకర్‌ల కాంబినేషన్‌లోనే భారతీయుడు రాబోతున్నాడు. తెలుగు నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని 200 కోట్లతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇటీవలే దిల్‌రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే తాజాగా తమిళ మీడియాలో ఈ చిత్రం నుండి కమల్‌ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కమల్‌ హాసన్‌ రెమ్యూనరేషన్‌ ఇష్యూలో తప్పుకున్నాడని, త్వరలోనే దర్శకుడు శంకర్‌ ఆ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

కమల్‌ స్థానంలో తమిళ స్టార్‌ హీరో సూర్యను ఎంపిక చేసేందుకు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు అన్ని కూడా సూర్య అభిమానులు పుట్టించినవి అని, కమల్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులు ఈ ప్రచారంను సోషల్‌ మీడియాలో మొదలు పెట్టడంతో ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా ఈ విషయమై తారా స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సూర్య ఈ విషయమై స్పందిస్తూ తాను భారతీయుడు సీక్వెల్‌ అనేది పెద్ద జోక్‌ అన్నాడు. కమల్‌ మరియు దర్శకుడు శంకర్‌ మాత్రం ఈ విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

దిల్‌రాజు ఇప్పటికే బడ్జెట్‌ ఏర్పాటు చేసే పనిలో పడ్డాడు. త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో 2.0 చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమా తర్వాత కమల్‌ను ఇండియన్‌ 2గా శంకర్‌ మార్చబోతున్నాడు.