కమల్ హాసన్ క్రేజీ థ్రిల్లర్ రీరిలీజ్ కి సిద్ధం!

కమల్ హాసన్ క్రేజీ థ్రిల్లర్ రీరిలీజ్ కి సిద్ధం!
Cinema News

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు దర్శకుడు శంకర్ తో భారీ సినిమా “ఇండియన్” సీక్వెల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా లతో పాటుగా కమల్ నుంచి కొన్ని క్లాసిక్ సినిమా లు కూడా రీ రిలీజ్ కి వస్తున్నాయి. ఇక వాటిలో రీసెంట్ గా మంచి బజ్ సెట్ చేసుకున్న సాలిడ్ థ్రిల్లర్ “ఆళవందాన్(అభయ్). మరి ఈ సినిమా తమిళ వెర్షన్ ని అయితే రీ రిలీజ్ కి సెట్ చేయగా ఈ మూవీ ని ఏకంగా 1000 స్క్రీన్స్ లో రీ రిలీజ్ కి ప్లాన్ చేశారు.

కమల్ హాసన్ క్రేజీ థ్రిల్లర్ రీరిలీజ్ కి సిద్ధం!
Cinema News

అయితే ఇప్పుడు ఈ సినిమా డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా ని డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత కలైపులి తాను కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ దక్కింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా కి కమల్ హాసన్ కథ అందించగా రవీనా టాండన్ హీరోయిన్ గా నటించింది. అలాగే శంకర్ ఈషాన్ లాయ్ లు సంగీతం అందించారు.