ఈసారి ఆగదంటున్నారు

kamal hassan vishwaroopam 2 movie release on august 20

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఎన్నో వివాదాలను మూట కట్టుకుంది. అంతటి విమర్శనాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ‘విశ్వరూపం’కు ఆ వెంటనే సీక్వెల్‌ చేయాని భావించాడు కమల్‌ హాసన్‌. విశ్వరూపం చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే కొత్త సినిమాకు స్క్రిప్ట్‌ సిద్దం చేయడంతో పాటు షూటింగ్‌ కూడా జరిపాడు. విశ్వరూపం విడుదలైన ఆరు నెలలకు విశ్వరూపం 2ను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే విశ్వరూపం 2 చిత్రం సంవత్సరాలకు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

విశ్వరూపం చిత్రం విడుదలైన తర్వాత ‘విశ్వరూపం 2’ కోసం కమల్‌ చాలా గట్టి ప్రయత్నాలు చేశాడు. కాని ఏదో ఒక అడ్డంకి వస్తూ సినిమా విడుదల ఇంకా కాలేదు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. భారీ ఎత్తున విడుదల కాబోతున్న విశ్వరూపం 2 చిత్రంలో కమల్‌ చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు. కమల్‌కు జోడీగా పూజా కుమార్‌ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇండియాలో ఉగ్రవాదం గురించిన సినిమా అవ్వడంతో జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తే మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 20న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కమల్‌ ప్రకటించాడు. టీజర్‌ మరియు ట్రైలర్‌లు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆగస్టు 20న విడుదల చేసి తీరుతాం అంటూ కమల్‌ చెబుతున్నాడు.