Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదయింది. హోంబణ్ణ చిత్ర హీరో సుబ్రహ్మణ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 23 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరు బసవగుడి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయింది. రాజాజీనగర్ కు చెందిన ఆ యువతి, సుబ్రహ్మణ్య రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. అయితే తాను నటిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, చిత్రీకరణ ముగియగానే పెళ్లిచేసుకుందామని సుబ్రహ్మణ్యం మాట ఇచ్చాడు. ఈ క్రమంలో నవంబర్ 1న తన అక్క ఇంట్లో పార్టీ ఉందని చెప్పి ఆ యువతిని సుబ్రహ్మణ్యం ఇంటికి పిలిచాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారం జరిపాడు. తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లిచేసుకుందామని నమ్మబలికాడు. ఇప్పుడు ఆమె పెళ్లిచేసుకోమని కోరుతుంటే…సుబ్రహ్మణ్య తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. సుబ్రహ్మణ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనంగా మారింది.