పెను ప్రమాదం నుండి బయటపడ్డ సినీ నటులు…!

Kannada Actors Darshan Devaraj And Prajwal Injured In Car Accident

నిన్న రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సినీ నటులు పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ చిత్రసీమలో ప్రముఖ నటులైన దర్శన్, దేవరాజ్, ప్రజ్వల్‌ దేవరాజ్‌ లు ముగ్గురు ఆడి కారులో మైసూరు నుంచి బెంగళూరుకు బయల్దేరారు. అయితే కొద్దిసేపటికి కారు డివైడర్‌ను, దానిపైనున్న కరెంటు పోల్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో అక్కడున్న కొందరు కారులోనివారిని బయటకు తీసి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

car-accedent

మైసూరు నగరంలోని జేఎస్‌ఎస్‌ అర్బన్‌హాత్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దర్శన్‌ స్నేహితుడు, కారు డ్రైవర్‌ ఆంటోని రాయ్‌ కూడా గాయపడ్డాడు. భారీ వర్షంలో కారు అదుపు తప్పడమే ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దర్శన్‌కు పక్కటెముకలకు గాయలయ్యాయి. దేవరాజ్‌కు ఎడమచేతి వేలికి, ఆంటోనీకి కాళ్లకు గాయాలు తగిలాయి. ప్రజ్వల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అందరూ సురక్షితమేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

road-accedent