తప్పతాగిన యువకుడు.. ట్యాంక్ బండ్ పై కారు… పల్టీలు.. ఆపై ఇలా

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న ఈ సమయంలో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఇలాంటి సమయంలో ఆకతాయిల చేష్టలు రోజు రోజుకూ శృతి మించి పోతున్నాయి. ఓవైప్ లాక్ డౌన్.. మరోవైపు కర్ఫ్యూ.. ఎవరూ రోడ్ల పైకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా కానీ వాహన దారులు మాత్రం యధేచ్చగా తిరుగుతూనే ఉన్నారు. అది కూడా తాగి మరి వాహనాలనూ నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

అయితే గత రాత్రి నగరరంలో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలవర పాటుకు గురిచేసింది.

ట్యాంక్ బండ్ పైకి ఇద్దరు యువకులు తాగి రోడ్డుపైకి వచ్చారు. అతివేగంతో కారు నడుపుతూ ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి వాటి టైర్లు ఊడిపోయాయి. ఎయిర్ బెలూన్ లు తెరుచుకోవడంతో ఆ యువకుడు గాయలతో బయటపడ్డాడు. ఆ సమయంలో వాళ్లు తాగారు అనడానికి ఆధారం వాళ్ళ కార్లో ఒక మద్యం బాటిల్ దొరకడంపై పోలీసులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులు కూడా హిమాయత్ నగర్ కు చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. డివైడర్ ను ఢీ కొట్టిన తర్వాత సుమారుగా ఒక 50 మీటర్ల దూరం వరకు కారు పల్టీలు కొట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా పోలీసు అధికారులు ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.