సీఎం కుర్చీలో రజని కూర్చోబోడట… వేణుస్వామికి ఛాన్స్ మిస్.

Karnataka Astrologer prediction on Rajinikanth political Career

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళ సూపర్ స్టార్ ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన ఇచ్చారో అప్పుడే జ్యోతిష్యుల హడావిడి మొదలైంది. కర్ణాటక కి చెందిన ప్రముఖ జోస్యుడు ప్రకాష్ అమ్మునై ఇప్పుడు సీన్ లోకి వచ్చాడు. మకర రాశి సింహ లగ్నంలో పుట్టిన రజని జాతకం ప్రకారం ఆయన కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ వుంది కానీ ఎన్నటికీ కింగ్ కాలేరని ప్రకాష్ చెబుతున్నారు. ఇక పుట్టిన సమయం రీత్యా రజని మీద గెలవడం ప్రత్యర్థులకు అసాధ్యం అంటున్నారు. అయితే రజని కి సన్నిహితులుగా వ్యవహరించే వాళ్ళతో మాత్రం ప్రమాదం ఉంటుందని కూడా ప్రకాష్ జోస్యం చెబుతున్నాడు.

ప్రకాష్ తన జోస్యం చెప్పి ఉరుకుంటే పర్లేదు గానీ ఆయన రజనికి రాజకీయ సలహాలు కూడా ఇచ్చేసారు. సీఎం పీఠం కోసం ఇంకో పేరు ముందు పెట్టి తాను అనుకున్నది జరిగేలా చేస్తే రజనికి మంచిదట. మరి తనని నమ్మి ఓట్లు వేసిన జనానికి రజని ఏమి సమాధానం చెప్పాలో మాత్రం ప్రకాష్ వివరించలేదు. ప్రకాష్ జోస్యం మీద రజని ఫాన్స్ మండిపడుతున్నారు. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు.

Venu-Swamy

సహజంగా రజని పొలిటికల్ ఎంట్రీ లాంటి సంఘటనలు జరిగితే అందరికన్నా ముందు వేణు స్వామి జోస్యం చెప్పేవాళ్ళు. అయితే ఇటీవలే బాబు గోగినేని చేతిలో అవమానం పాలైన వేణు స్వామి ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకునే పనిలోవున్నారు. బాబు గోగినేని ని టార్గెట్ చేస్తున్నారు. ఈ హడావిడిలో పడి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ లాంటి పెద్ద ఎపిసోడ్ ని మిస్ చేసుకున్నారు పాపం.