చరణ్‌, బోయపాటి సినిమా క్యాన్సిల్‌ అయ్యిందా?

ram charan boyapati movie canceled
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవలే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఒక చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందే. త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, ఇటీవలే రాజస్థాన్‌లోని రాజమహల్‌లో టెస్ట్‌ షూట్‌ చేసుకు వచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అటకెక్కించినట్లుగా చెబుతున్నారు. బోయపాటి రెడీ చేసిన కథ కాస్త అటు ఇటుగా హిందీలో వచ్చిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ కథను పోలి ఉందని, ఆ కారణంగానే సినిమాను పక్కకు పెట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి. మొదట చరణ్‌ స్టోరీ లైన్‌ చెప్పగానే ఇంప్రెస్‌ అయ్యి ఓకే చెప్పాడు. కాని కథ పూర్తిగా విన్న తర్వాత హిందీ సినిమాకు రీమేక్‌ అన్నట్లుగా ఉందనే అభిప్రాయంకు వచ్చేశాడట.

ram charan and boyapati movie

చరణ్‌ కథకు నో చెప్పడంతో బోయపాటి కొత్త కథను సిద్దం చేసేందుకు సమయం తీసుకుంటున్నాడు. ఈనెల చివరి వరకు కొత్త కథతో వస్తే అదే డేట్స్‌తో సినిమా చేద్దామని లేదంటే మరో దర్శకుడితో సినిమా చేస్తాను అంటూ బోయపాటికి చరణ్‌ డెడ్‌ లైన్‌ పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి చరణ్‌, బోయపాటిల చిత్రం గురించి సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో తారా స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మెగా ఫ్యాన్స్‌ మాత్రం సినిమా క్యాన్సిల్‌ అవ్వదని, తప్పకుండా ఇద్దరి కాంబో ఉందని, ప్రేమ్‌లీలాకు ఈ చిత్రానికి సంబంధం లేదని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అంటూ ఫ్యాన్స్‌ కొట్టి పారేస్తున్నారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి మాత్రం క్లారిటీ రాలేదు.