పవన్‌, కత్తి మహేష్‌ మద్యలో పూనం కౌర్‌

heroine poonam kaur respond kathi mahesh comments on pawan kalyan
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై గత కొన్ని రోజులుగా కత్తి మహేష్‌ చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆ విషయమై పెద్దగా స్పందించలేదు. కాని కత్తి తన వ్యాఖ్యలకు పదును పెంచుతున్న నేపథ్యంలో సినిమా పరిశ్రమ నుండి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇటీవలే కోన వెంకట్‌ మాట్లాడుతూ కత్తి మహేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. కోనకు కౌంటర్‌గా కత్తి కూడా తీవ్ర పదజాలంతో తిపికొట్టే ప్రయత్నం చేశాడు. తాజాగా హీరోయిన్‌ పూనం కౌర్‌ ఈ విషయమై స్పందించింది. సోషల్‌ మీడియా ద్వారా పవన్‌కు మద్దతుగా కత్తి మహేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అడుక్కు తినే వాడి కంటే దారుణంగా కత్తి మహేష్‌ అయ్యాడు అని, ఆయన ఉద్యోగం లేక ఇలా చేస్తున్నాడు అంటూ ఆమె విమర్శలు చేసింది.

Poonam Kaur Sensational Comments On Kathi Mahesh About Pawan Kalyan

పూనం కౌర్‌ విమర్శలను అదే స్థాయిలో కత్తి మహేష్‌ వెంటనే తిప్పి కొట్టాడు. పవన్‌ దయవల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ చేనేతకు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యింది. ఆమెకు పవన్‌ ఉద్యోగం ఇప్పించాడు కనుక ఆమె పవన్‌ను వెనకేసుకు వస్తూ, నన్ను విమర్శిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కత్తి మహేష్‌ ఇంకా ఆమె గురించి మాట్లాడుతూ గతంలో పవన్‌కు నాల్గవ భార్యగా తాను అవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మొత్తానికి పవన్‌కు మద్దతుగా ఎవరు మాట్లాడినా, తనను విమర్శిస్తూ ఎవరు మాట్లాడినా కూడా మళ్లీ నోరు తెరవకుండా వారిపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్‌ను విమర్శించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. కత్తి కౌంటర్‌కు పూనం ఇప్పటి వరకు సైలెంట్‌గానే ఉంది.

 Poonam Kaur about  Kathi Mahesh