‘జై సింహా’ ఒక హై ఓల్టేజ్‌ సినిమా

Jai Simha' is a high voltage movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి నట సింహా బాలకృష్ణ 102వ చిత్రం ‘జైసింహా’ విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న ‘జైసింహా’ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యను ఫ్యాన్స్‌ ఎలా చూడాలని కోరుకుంటున్నారో దర్శకుడు అలా చూపించాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ బాలయ్య పవర్‌ ఏ రేంజ్‌లో ఈ చిత్రంలో చూపించబోతున్నాడో చెప్పకనే చెప్పాడు. బాలకృష్ణ ఈ చిత్రంలో తన నట విశ్వరూపంను చూపించబోతున్నాడు.

‘లెజెండ్‌’, ‘సింహా’ రేంజ్‌లో ఇందులో కూడా బాలయ్య హై ఓల్టేజ్‌తో కనిపించబోతున్నాడు. పవర్‌ ఫుల్‌ పాత్రలో బాలయ్య మరోసారి నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటూ ఇప్పటికే తేలిపోయింది. డబుల్‌ రోల్‌లో బాలయ్య చూపించిన వైవిధ్యంను చూసేందుకు సినీ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నయనతార, హరిప్రియ, నటాషాలు హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన నటీనటులు కనిపించబోతున్నారు.

దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ చాలా కాలంగా ఈ కథకు తగ్గ హీరో కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు బాలయ్య రూపంలో ఆయనకు కథకుడు లభించాడు. సంక్రాంతికి పవన్‌ సినిమా విడుదల అవుతున్నా కూడా సినిమాపై నమ్మకంతో పోటీకి బాలయ్య సై అన్నాడు. గత సంక్రాంతికి గౌతమిపుత్రతో ఆకట్టుకున్న బాలయ్య ఈ సంక్రాంతికి జైసింహాతో మాస్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం.