కేసీఆర్ కి షాక్…బహిష్కరణ ఎత్తివేత…!

High Court Lifts Ban On Swami Paripoornanda

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ తీరును నిరసిస్తూ పరిపూర్ణానంద పాదయాత్రకు సిద్దమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనపై బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే పరిపూర్ణనంద స్వామిపై నగర బహిష్కరణ వేటును ఎత్తివేస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన తిరిగి నగరంలోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం అయింది.

paripurnanandh-swami

కత్తి విషయంలోనే ఆయనకు నగర బహిష్కరణ విధించినా గత ఏడాది ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే పరిపూర్ణానందపై బహిష్కరణ వేటు వేశామని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో పోలీసులు పేర్కొని తమ మీద తప్పులేకుండా చూసుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం విధించిన బహిష్కరణ వేటును సవాల్ చేస్తూ పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేయడంతో ఆయనకు ఊరట లభించినట్టయింది.

kathi-mahesh