రాహుల్ తో భేటీ అయిన బ్రాహ్మణి…రీజన్ అదే !

nara brahmani meets rahul gandhi
రెండ్రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో ఉన్న రాహుల్ గాంధీని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భార్య, నారా బ్రాహ్మణి కలిశారు. ఆయనతో పాటు సమావేశం కూడా అయ్యారు. పూర్తి వివరాలలోకి వెళితే రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు భాగ్యనగరంలోని పలువురు ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు.
nara-brahmani-And-rahul-gan
అయితే ఈ సమావేశానికి హెరిటేజ్ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బ్రాహ్మణి ఈ సమావేశం అయ్యారు. అయితే ఇప్పుడు కేంద్రంతో తెలుగుదేశం తెగదెంపులు చేసుకుని ఉన్న సమయంలో కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తుందన్న ఊహాగానాలా నేపధ్యంలో నారా బ్రాహ్మణి రాహుల్ భేటీకి హాజరవడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే రాహుల్ తో ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కుమారుడు, నటుడు రానా, మరికొందరు వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 nara brahmani